పోలవరం స్పిల్ వే లో నిర్మాణ పనులు | Polavaram project Total Video |social media

0 Просмотры
Издатель
polavaram gates || social mediaపోలవరం లో మేఘా కంపెనీ పని చేసిన వివరాల;(01-01-2021) నాటికి;


మేఘా ఇంజనీరింగ్ సంస్ద నవంబర్ 21-2019 న పోలవరం పనులు ప్రారంభించింది.

పనులు చేపట్టే నాటికి 2019లో వచ్చిన వరదల వల్ల పాడైన అంతర్గత రహదారులను నిర్మించుకోవడం జరిగింది.

 2019లో స్పిల్ ఛానెల్ లో నిలిచి ఉన్న  దాదాపు 4 టిఎంసిల వరద నీటిని తోడటం జరిగింది.

స్పిల్ వే ;

పోలవరం స్పిల్ వే లో 229061 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పని చేయడం జరిగింది.

ప్రాజెక్టు స్పిల్ వే పై ఏర్పాటు చేయాల్సిన 192 గడ్డర్లు ను అనతికాలంలోనే  నిర్మాణం   పూర్తి చేయడం జరిగింది.

స్పిల్ వే పిల్లర్లు ఒక్కో పిల్లర్ 52 మీటర్లు ఎత్తులో నిర్మాణం చేయాల్సి ఉండగా దాదాపు అన్ని పిల్లర్లు సగటున మీటర్లు ఎత్తుకు చేరుకోవడం జరిగింది.

స్పిల్ వే  పిల్లర్లు పై  172 గడ్డర్లు ఏర్పాటు చేయడం జరిగింది.మిగతా వాటి ఏర్పాటు కొనసాగుతుంది.

 పిల్లర్లుపై 37 శ్లాబులు అనగా దాదాపు 780 మీటర్లు శ్లాబ్ కాంక్రీట్  పని పూర్తి చేయడం జరిగింది.మిగతా వాటిపై షట్టరింగ్,స్టీల్ ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయి.

గేట్ల ఏర్పాటు లో కీలకమైన 48 ట్రూనియన్ భీంలకు గాను 37 ట్రూనియన్ భీంల నిర్మాణం పూర్తైంది.మిగతా వాటి పనులు కూడా వేగంగా సాగుతున్నాయి.

గేట్లు ఏర్పాటు ప్రారంభమైంది.ఇప్పటికే 9 గేట్లు ఏర్పాటు చేయడం జరిగింది.వీటిలో ఈ9 గేట్లకు సంబందించి ఆర్మ్ గడ్డర్లు,హారిజాంటల్ గడ్డర్లు,స్కిన్ ప్లేట్లు,అమర్చడం జరిగింది,అదేవిధంగా వెల్డింగ్ పనులు జరుగుతున్నాయి,

 ఏడాది నుండి ఓ వైపు కరోనా మరో వైపు వరదలు వచ్చినా పనులకు ఆటంకం కలుగకుండా జాగ్రత్తగా ఇంజనీరింగ్ పద్దతుల్లో పనుల చేయడం జరుగుతోంది.

కేవలం కరోనా కష్ట కాలంలోనే 1లక్ష క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేయడం జరిగింది.

స్పిల్ ఛానెల్ ;

 ఇప్పటి వరకు 1,10,033 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పని చేయడం జరిగింది.

అదే విధంగా స్పిల్ ఛానెల్ లో 10,64,417 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు చేయడం జరిగింది.

2020 జూలై లో వచ్చిన వరదల వల్ల భారీగా వరద నీరు నిలిచి ఉండటం వల్ల జూలై నుండి స్పిల్ ఛానెల్ లో కాంక్రీట్ పని, మట్టి తవ్వకం పనులు నిలిచి పోయాయి.

ఇప్పటికే స్పిల్ ఛానెల్ లో వరద నీటిని తోడే ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది.ఇప్పటికే 2టిఎంసి లకు పైగా వరద నీటిని తోడటం జరిగింది.మిగిలిన వరద నీటిని త్వరిత గతిన తోడేలా దాదాపు 70 మోటారు పంపులు ఏర్పాటు చేయడం జరిగింది.

స్పిల్ ఛానెల్ లో  ఇప్పటికే వరద నీరు తొలగించిన ప్రదేశంలో రోడ్ల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది.అదే విధంగా మట్టి తవ్వకం పనులు కూడా మొదలయ్యాయి.

902 కొండ తవ్వకం పనులు; 

దాదాపు లక్షల క్యూబిక్ మీటర్లు కు పైగాకొండ తవ్వకం పనులు పూర్తి అయ్యాయి.

గ్యాప్-3;

 గ్యాప్ 3లో 140 మీటర్లు కాంక్రీట్ డ్యాం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.ఇప్పటికే  1211 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పనిచేయడం జరిగింది.

గ్యాప్-2;  

వైబ్రోకాంప్యాక్షన్ పనులు 1106375 క్యూబిక్ మీటర్లు పూర్తి చేయడం జరిగింది.

అదే విధంగా 1,61,310 క్యూబిక్ మీటర్ల శాండ్ ఫిల్లింగ్ పనులు పూర్తి అయ్యాయి.

గ్యాప్-1; 

గ్యాప్-1లో కీలకమైన ఢయా ఫ్రంవాల్ ప్లాస్టిక్ కాంక్రీట్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

85 కాలమ్స్ కు గాను ఇప్పటికే 39 కాలమ్స్ లో  కాంక్రీట్ నిర్మాణం పూర్తి అయింది.

గ్యాప్ 1లో వైబ్రో స్టోన్ కాలమ్స్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.ఇప్పటికే 1789 ప్రోబ్స్ పూర్తి అయ్యాయి.

 ఎగువ కాఫర్ ఢ్యాం ;

ఎగువ కాఫర్ డ్యాం ఎత్తు పెంచేందుకు బండరాయి తోలకం పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఇప్పటి వరకు 18480 క్యూబిక్ మీటర్లు రాక్ ఫిల్ పనులు జరిగాయి.
Категория
Комедии HD
Комментариев нет.